3,035 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
- టీజీఎస్ఆర్‌టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ సర్కార్ అనుమతి
- డ్రైవర్-2000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్- 114 తదితర పోస్టులు
- త్వరలోనే నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టీజీఎస్ఆర్‌టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి మంగళవారం కాంగ్రెస్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డ్రైవర్ పోస్టులు 2000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)- 114, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)- 84, డీఎం/ఏటీఎం/ మెకానికల్ ఇంజినీర్- 40, మెడికల్ ఆఫీసర్- 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)- 11, అకౌంట్స్ ఆఫీసర్- 6 తదితర పోస్టులున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఇక ఖాళీల భర్తీకి గత కొన్ని రోజులుగా టీజీఎస్ఆర్‌టీసీ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఆర్‌టీసీలో 43వేల మంది ఉద్యోగులు ఉన్నారని, పదేళ్లుగా కొత్త నియామకాలు జరగలేదని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు త్వరలో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి చెప్పినట్టే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3,035 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది.