పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు

  • గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు
  • నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
  • తగ్గిన వెండి ధరలు
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. పుత్తడితోపాటు పెరిగే వెండి ధరలు మాత్రం కొద్దిగా క్షీణించాయి.  24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 400 పెరిగి రూ. 73,024కు చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములపై 360 పెరిగి రూ. 66,890గా నమోదైంది. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 370 తగ్గి రూ. 87,890 వద్ద స్థిరపడింది.

ఇక, దేశరాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు నేడు రూ.73,024 ఉండగా, వెండి ధర రూ. 87,890గా రికార్డయింది. చెన్నైలో బంగారం, వెండి ధరలు వరుసగా రూ. 73,096, రూ. 87,980గా ఉండగా, ముంబైలో రూ. 73,311, రూ. 87,890గా ఉన్నాయి. కోల్‌కతాలో రూ. 73,743, రూ. 87,890గా నమోదయ్యాయి. 

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేడు రూ. 72,380గా ఉండగా, వెండి ధర కిలో రూ. 95,500గా ఉంది. ఈ ధరలు ఈ వార్త రాసే సమయానికి మాత్రమే. కొనుగోలు చేసిన సమయంలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేయడానికి ముందు ధరలు విచారించుకోవాల్సి ఉంటుంది.


More Telugu News