సభ్యత్వం రద్దు డిమాండ్... బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిపై దానం నాగేందర్ ఆగ్రహం
- దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌ను కోరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని అడిగే అధికారం లేదన్న దానం నాగేందర్
- పార్టీ మారడం అనేది దేశంలో కొత్తేమీ కాదని వ్యాఖ్య
బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన సభ్యత్వాన్ని రద్దు చేయమని అడిగే అధికారం బీజేపీ ఎమ్మెల్యేకు లేదన్నారు. ఆయన ఏ హోదాతో తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారడం అనేది దేశంలో కొత్తేమీ కాదన్నారు. తన సభ్యత్వంపై ఇప్పటికే హైకోర్టులో కేసు ఉందని గుర్తు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అందుకే బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుందన్నారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం లేకుంటే మూడు సీట్లు కూడా రాకపోయి ఉండేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉందని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టే ఆ రెండు పార్టీలు ఒక్కటని అర్థమవుతోందన్నారు.
కాగా, దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి... ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడంపై బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దానం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు.