యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల

  • 1,056 పోస్టుల భర్తీ కోసం  యూపీఎస్సీ సివిల్స్-2024
  • జూన్ 16న దేశవ్యాప్తంగా ప్రిలిమ్స్ పరీక్ష
  • upsc.gov.in వెబ్ సైట్ లో ఫలితాల విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేడు సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసింది. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన వారు యూపీఎస్సీ మెయిన్స్ కు అర్హత పొందుతారు. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 16న దేశవ్యాప్తంగా నిర్వహించారు. 

ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 400 మార్కులకు గాను రెండు పేపర్లు అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. upsc.gov.in వెబ్ పోర్టల్ లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు పొందుపరిచినట్టు యూపీఎస్సీ వెల్లడించింది.

కాగా, యూపీఎస్సీ సివిల్స్-2024 నోటిఫికేషన్ ప్రకారం... కేంద్ర సర్వీసులు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,056 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) కూడా ఉన్నాయి. 




More Telugu News