పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: హరీశ్ రావు
- నిరుద్యోగుల తరఫున గాంధీ ఆసుపత్రిలో మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహారదీక్ష
- ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకుల అరెస్ట్
- దీనిపై 'ఎక్స్' వేదికగా స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
- అక్రమ అరెస్టులు చేసిన వారిని తక్షణం వదిలిపెట్టాలని డిమాండ్
నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ మీడియాతో మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కారించాల్సింది పోయి, పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. ఇదేనా మీ ప్రజా పాలన? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నాయకులకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు చేసిన వారిని తక్షణం వదిలిపెట్టాలన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.