టీమిండియా టీ20 వరల్డ్‌కప్ గెలిచినందుకు.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన బెంగళూరు సంస్థ!
- 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్‌కప్‌ను ముద్దాడిన రోహిత్ సేన
- దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత్
- భారత జట్టు గొప్ప విజయాన్ని పురస్కరించుకొని సెలవిచ్చిన ఎక్స్‌ఫెనో సంస్థ
11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా టీ20 వరల్డ్‌కప్ టైటిట్‌ను ముద్దాడింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి రెండో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
ఇక టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు సోమవారం సెలవు ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఎక్స్‌ఫెనో అనే స్టాఫింగ్ సంస్థ జులై 1న ఉద్యోగులకు హాలిడే ప్రకటించి వార్తల్లో నిలిచింది. భారత జట్టు గొప్ప విజయాన్ని సాధించిందని, అందుకుగానూ ఇవాళ సెలవు ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు ఆ సంస్థ వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ హెడ్ ఎంఎస్ ప్రసాద్ తెలిపారు.
వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ హెడ్ ఎంఎస్ ప్రసాద్ మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ, “ఇది మన అందరికీ సర్‌ప్రైజ్ కలిగించిన విషయం. ఇక ప్రతినెల మొదటి రోజు సాధారణంగా బిల్లింగ్స్, పేరోల్ క్లోజర్లు మొదలైనవి ఉంటాయి. మాములుగా అయితే ఈ రోజు చాలా బిజీ. కానీ, టీమిండియా గొప్ప విజయం సాధించినందుకు ఈ రోజు సెలవు ప్రకటించాలని నిర్ణయించాం. మా తరఫున భారత జట్టు బాయ్స్‌కు చిన్న అభినందన" అని చెప్పుకొచ్చారు.
కాగా, ఎక్స్‌ఫెనో అధికారిక లింక్డ్ఇన్ పేజీ ప్రకారం ఇది ఒక డైరెక్ట్ హైర్, ఆర్‌పీఎ, ఐటీ స్టాఫ్ ఆగ్మెంటేషన్, ఎగ్జిక్యూటివ్ సెర్చ్, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ సేల్స్/సపోర్ట్ స్టాఫింగ్ సేవలను అందించే స్పెషలిస్ట్ టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ అని తెలుస్తోంది.