కొత్త చట్టాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏమన్నారంటే...!

  • దేశంలో ఐపీసీ తదితర పాత చట్టాల తొలగింపు
  • నేటి నుంచి భారత్ లో కొత్త శిక్షాస్మృతుల అమలు
  • కొత్త చట్టాలతో నేర విచారణ వేగంగా జరుగుతుందన్న అమిత్ షా
  • విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు
బ్రిటీష్ పాలన నాటి ఐపీసీ, తదితర పాత శిక్షాస్మృతులను తొలగిస్తూ, వాటి స్థానంలో ఎన్డీయే ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చింది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. 

కొత్త చట్టాల ద్వారా న్యాయ విచారణ వేగంగా జరుగుతుందని, బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తయ్యేందుకు కొత్త చట్టాలు ఉపకరిస్తాయని స్పష్టం చేశారు. 

అయితే, కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్ష నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు. భారతీయ న్యాయ సంహిత తదితర చట్టాలపై లోక్ సభలో తొమ్మిదిన్నర గంటలు, రాజ్యసభలో ఆరు గంటల పాటు చర్చించామని తెలిపారు. కొత్త చట్టాలపై మరింత చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా, కొత్త న్యాయ చట్టాలపై అభిప్రాయాలు పంచుకోవాలని ఎంపీలకు లేఖ రాశానని అమిత్ షా వెల్లడించారు.


More Telugu News