సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- అధికారిక విప్ లు గా బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ లను నియమించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సీఎం చంద్రబాబుకు ప్రతిపాదన
- ఓ ప్రకటనలో తెలిపిన జనసేన పార్టీ
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ లను అధికారిక విప్ లు గా నియమించాలని కోరుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపురం స్థానం నుంచి గెలుపొందారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అరవ శ్రీధర్ రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కల్యాణ్ సహా మొత్తం 21 మంది పోటీ చేయగా, 21 మంది విజయం సాధించడం విశేషం. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ లకు ఏపీ క్యాబినెట్ లో స్థానం దక్కింది.