ఆన్‌లైన్‌లో ఫేమస్ అవ్వాలని.. నోయిడా టవర్ ఎక్కిన యూట్యూబర్.. తర్వాత జరిగింది ఇదీ!
- యువకుడు టవర్ ఎక్కుతుండగా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చిన స్నేహితుడు
- స్థానికులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరార్
- టవర్‌పై చిక్కుకుపోయిన యూట్యూబర్
- ఐదు గంటల ప్రయత్నాల తర్వాత యువకుడిని రక్షించిన పోలీసులు
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత చేస్తున్న ప్రయోగాలు కొన్నిసార్లు వికటించి పీకలమీదికి తెస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇలాంటి ఘటనే జరిగింది. నీలేశ్వర్ అనే యువకుడు ‘నీలేశ్వర్22’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. అతడికి 8.87 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన వ్యూయర్‌షిప్‌ను పెంచుకునేందుకు తాజాగా అతను చేసిన ఓ సాహసకృత్యం వికటించింది. దీంతో పోలీసులు ఐదు గంటలపాటు కష్టపడి అతడిని అతికష్టం మీద రక్షించాల్సి వచ్చింది.
సబ్‌స్క్రైబర్లతోపాటు వ్యూయర్‌షిప్‌ను కూడా పెంచుకోవాలని భావించిన నీలేశ్వర్ ఓ ఫ్రెండ్ సాయంతో తన స్టంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగా గ్రేటర్ నోయిడాలోని టిగ్రి గ్రామంలో ఎత్తైన టవర్‌ను ఎక్కాడు. కిందనున్న అతడి స్నేహితుడు దానిని లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాడు. ఈ ప్రమాదకర స్టంట్‌ను చూసిన స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారిని చూసి భయపడిన నీలేశ్వర్ స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో పైనే ఉండిపోయిన నీలేశ్వర్ అక్కడే చిక్కుకుపోయాడు. కిందనున్న జనం ఏం జరుగుతుందో చూద్దామని అక్కడే గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, అతడిని కిందికి దింపడంలో సవాళ్లు ఎదురయ్యాయి. దాదాపు ఐదు గంటల తర్వాత నీలేశ్వర్‌ను పోలీసులు సురక్షితంగా కిందికి దింపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నీలేశ్వర్‌పై చర్యలకు సిద్ధమవుతున్నారు.