'కల్కి 2898 ఏడీ' చిత్రంలో అర్జునుడిగా నటించడంపై విజయ్ దేవరకొండ స్పందన

  • జూన్ 27న రిలీజైన ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రం
  • మూడ్రోజుల్లో రూ.415 కోట్లు వసూలు
  • కల్కి చిత్రం చివర్లో మహాభారత యుద్ధం ఎపిసోడ్
  • అర్జునుడిగా విజయ్ దేవరకొండ... కర్ణుడిగా ప్రభాస్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడీ చిత్రం మేనియానే నడుస్తోంది. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ.415 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 

కాగా, కల్కి 2898 ఏడీ చిత్రంలో మహాభారతం ఎపిసోడ్ కూడా ఉంది. ఇందులో అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించారు. తన పాత్రపై విజయ్ దేవరకొండ స్పందించారు. నాగీ, ప్రభాస్ అన్న కోసం ఆ పాత్ర చేశానని వెల్లడించారు. 

తాను అర్జునుడిగా నటిస్తే, ప్రభాస్ కర్ణుడిగా నటించారని... అయితే స్క్రీన్ పై తమను విజయ్ దేవరకొండగా, ప్రభాస్ గా చూడొద్దని... అర్జునుడిగా, కర్ణుడిగా మాత్రమే చూడాలని విజయ్ సూచించారు. కల్కి 2898 ఏడీ చిత్రం చివరలో వచ్చే ఎపిసోడ్ లో అర్జునుడి పాత్ర పోషించడం తనకు చాలా సంతోషం కలిగించిందని తెలిపారు.


More Telugu News