ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

  • ఎన్నికల ముందు 6,100 టీచర్ పోస్టులతో వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్
  • ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం
  • 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన
  • పాత నోటిఫికేషన్ రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
  • నేడు జీవో విడుదల
ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నేడు జీవో జారీ చేసింది. 

నాడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో 6,100 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో వచ్చింది. అయితే, నిరుద్యోగులను మభ్యపెట్టేందుకే హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారంటూ వైసీపీ ప్రభుత్వంపై నాడు విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల హామీ ఇచ్చాయి. 

ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటీవలే 16,347 పోస్టులతో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖ రద్దు చేసింది.


More Telugu News