వంద రోజుల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది: బండి సంజయ్

  • తెలంగాణ సర్కారుపై బండి సంజయ్ ఫైర్
  • బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా పయనిస్తోందని విమర్శలు
  • బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గం అని వ్యాఖ్యలు
  • కేంద్రం కూడా అదే విధంగా చేస్తే కాంగ్రెస్ ఎంపీల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్న
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వంద రోజుల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు. 

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా పయనిస్తోందని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గం అని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలకు నిధులు ఇవ్వకపోతే ఏమవుతుందో ఆలోచించండి అని అన్నారు. తమ మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దు అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలను సమదృష్టితో చూడాలని రేవంత్ సర్కారుకు హితవు పలికారు. 

పార్టీ ఫిరాయింపుల్లోనూ బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ పార్టీకి తేడా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పై సొంత ఎమ్మెల్యేలే తిరగబడిన సంగతి కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక, సింగరేణి గనుల ప్రైవేటీకరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News