అదృష్టం నన్ను ఈ విధంగా వరించింది: రాహుల్ ద్రావిడ్
- ఆటగాడిగా కెరీర్ లో ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేకపోయిన ద్రావిడ్
- టీమిండియా కోచ్ గా టీ20 వరల్డ్ కప్ కైవసం
- సంతోషంతో పొంగిపోతున్న ద్రావిడ్
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను మీడియా పలకరించింది. ఆటగాడిగా లభించని అదృష్టం తాను కోచ్ గా ఉన్నప్పుడు వరించిందని చెబుతూ సంతోషంతో ఉప్పొంగిపోయారు.
"ఓ ఆటగాడిగా నేను అత్యుత్తమ ఆటతీరు కనబరిచినప్పటికీ వరల్డ్ కప్ గెలిచే అదృష్టానికి నోచుకోలేదు. ఆ తర్వాత జట్టుకు కోచ్ గా వ్యవహరించే అవకాశం తలుపుతట్టింది. నా అదృష్టం కొద్దీ ఈ కుర్రాళ్ల జట్టు నాకోసం ట్రోఫీ గెలిచింది. ఈ భావన ఎంతో గొప్పగా ఉంది. వరల్డ్ కప్ గెలిస్తే చాలు... ఇక తప్పుకుందాం అని ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోలేదు. ఇది నా వృత్తి అనుకున్నాను. ఏదేమైనా ఇదొక అద్భుతమైన ప్రస్థానం. ఇక, వచ్చే వారం నుంచి నేను నిరుద్యోగిని... ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పండి" అంటూ ద్రావిడ్ చమత్కరించారు.
టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీనే చివరి అసైన్ మెంట్ అని తెలిసిందే. ఈ టోర్నీతో టీమిండియా కోచ్ గా ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. ద్రావిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.