కొండగట్టుకు చేరుకున్న అయోధ్య రాముడి బాణం
- రామయ్యకు నిజామాబాద్ భక్తుడి కానుక
- దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల దర్శనం
- అంజన్న సన్నిధిలో రామ బాణానికి ప్రత్యేక పూజలు
అయోధ్య బాల రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణం ప్రస్తుతం కొండగట్టుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకెళుతూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంజన్న సన్నిధికి చేరింది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాల రాముడి కోసం ఈ బాణాన్ని తయారు చేయించాడు.
ఈ బాణాన్ని దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శింపజేసి చివరగా అయోధ్యకు తీసుకువెళ్లి బాలరాముడికి సమర్పిస్తామని శ్రీనివాస్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం ఈ బాణానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించాడు. ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్, స్థానచార్యుడు కపిందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, భక్తులు పాల్గొన్నారు.