కోచ్‌గా ముగిసిన ద్రావిడ్ పదవీకాలం.. తదుపరి కోచ్‌పై బీసీసీఐ కీలక ప్రకటన
- అన్ని ఫార్మాట్లు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడి అవసరం ఉందన్న బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ
- గంభీర్ బాధ్యతలు స్వీకరిస్తే అది ఇండియన్ క్రికెట్‌కు మంచి విషయమే అవుతుందని వ్యాఖ్య
- ప్రపంచకప్ అందించి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ద్రావిడ్
కోచ్ రాహుల్ ద్రావిడ్-కెప్టెన్ రోహిత్‌శర్మ భాగస్వామ్యం సూపర్ హిట్ అయింది. కోచ్‌గా దేశానికి టీ20 ప్రపంచకప్ అందించిన ద్రావిడ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. దేశానికి ట్రోఫీ అందించిన ‘మెన్ ఇన్ బ్లూ’ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అభినందించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కోచ్ పాత్రను స్వీకరిస్తే భారత జట్టుకు అది మంచి విషయం అవుతుందని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ ముగియడంతోనే కోచ్‌గా ద్రావిడ్ పదవీకాలం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. 2011లో భారత జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన గౌతం గంభీర్ కోచ్ అయితే బాగుంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. గంభీర్ కూడా కోచ్‌గా వచ్చేందుకు సై అన్నాడు. ఆ అవకాశం వస్తే అది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. బీసీసీఐ అతడిని ఇంటర్వ్యూ కూడా పూర్తిచేసింది. అయితే, ద్రావిడ్ బాధ్యతలు వీడే సమయం దగ్గరపడుతున్నా గంభీర్ మాత్రం ఇప్పటి వరకు కోచింగ్ బాధ్యతలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమైంది.
బిన్నీ మాట్లాడుతూ అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన అనుభవం ఉన్న ఆటగాడి కోసం ఎదురుచూస్తున్నామని, అతడికే కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొన్నాడు ‘‘గంభీర్‌కు ఆ అనుభవం పుష్కలంగా ఉంది. అతడు కనుక బాధ్యతలు స్వీకరిస్తే అది భారత క్రికెట్‌కు మంచి విషయమే అవుతుంది. అతడి అనుభవం భారత్‌కు కావాలి. అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన అనుభవం ఉన్న ఆటగాడిని కోచ్‌గా కోరుకుంటున్నాం’’ అని బిన్నీ పేర్కొన్నాడు.