'కల్కి 2898 ఏడీ' కళ్లు చెదిరేలా ఉంది: అల్లు అర్జున్
- ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ
- జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్
- సినిమాపై అద్భుతమైన రీతిలో అల్లు అర్జున్ రివ్యూ
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో, భారీ వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. తాజాగా, కల్కి 2898 ఏడీ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ చిత్రం కళ్లు చెదిరే విజువల్స్ తో కనుల పండుగలా ఉందని అభివర్ణించారు. కల్కి 2898 ఏడీ చిత్ర బృందానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
"సూపర్ హీరో తరహాలో తన నటనా ప్రతిభతో ఈ భారీ చిత్రానికి ప్రాణం పోసిన నా ప్రియమిత్రుడు ప్రభాస్ కు వందనాలు. అమితాబ్ బచ్చన్ గారూ... మీరు నిజంగా స్ఫూర్తిప్రదాతలు. ఈ సినిమాలో మీ నటన చూశాక ఇక మాటల్లేవ్! కమల్ హాసన్ సర్... మీ పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు. మీరు భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరిన్ని చేస్తారని ఆశిస్తున్నాం. డియర్ దీపికా పదుకొణే... అదరగొట్టేశావ్... సునాయాసంగా నటించావు. దిశా పటానీ... నువ్వు తెరపై ఎంతో ఆకర్షణీయంగా కనిపించావు డియర్.
నటీనటులకు, టెక్నీషియన్లకు... ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, మేకప్ విభాగం నిపుణులకు అభినందనలు. ఈ ఘనత అంతా వైజయంతీ మూవీస్ కు, అశ్వనీదత్ గారికి, స్వప్న దత్, ప్రియాంక దత్ లకే దక్కుతుంది. ఎంతో రిస్క్ తీసుకుని భారతీయ సినిమా ప్రమాణాలను పెంచే బృహత్తర చిత్రాన్ని అందించారు.
ఇక కెప్టెన్ నాగ్ అశ్విన్ గారు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు అచ్చెరువొందేలా ఈ సినిమాను తెరకెక్కించారు. మూస ధోరణులను ధ్వంసం చేసి ఈ తరం కోసం సరికొత్త బాటలు వేసిన ఫిలింమేకర్ నాగ్ అశ్విన్... ఆయనకు నా అభినందనలు. చివరగా... అంతర్జాతీయ స్థాయి చిత్రాలకు దీటుగా మన సాంస్కృతిక సున్నితత్వాలతో వెండితెరపైకి వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ" అంటూ అల్లు అర్జున్ తన రివ్యూలో పేర్కొన్నారు.