ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయం అంతలా ఎలా పెంచుతారు?: అధికారులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

  • ఎలాంటి అప్రూవ్ లేకుండా అంచనా వ్యయం పెంచారని ఆగ్రహం
  • మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్లు ఎలా పెంచుతారో చెప్పాలని నిలదీత
  • నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచారని మండిపాటు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో అంచనా వ్యయం పెంచడంపై అధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని నిలదీశారు. మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్లు ఎలా పెంచుతారో చెప్పాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచారన్నారు.

నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.


More Telugu News