యోగి వేమన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

  • ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం
  • వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన వర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్ల రాజీనామాలు
  • యోగి వేమన వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామాలు ఆమోదించిన ఉన్నత విద్యామండలి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో... వైసీపీ అనుకూలురని ముద్రపడిన వర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది.

తాజాగా కడప  యోగి వేమన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి చింతా సుధాకర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఏపీ ఉన్నత విద్యా మండలి ఆమోదించింది. యోగి వేమన వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య కూడా రాజీనామా చేశారు. వెంకటసుబ్బయ్య రాజీనామాను ఉన్నత విద్యామండలి ఆమోదించింది. 

చింతా సుధాకర్, వెంకటసుబ్బయ్య తమ పదవీకాలంలో వైసీపీకి సన్నిహితంగా మెలిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరి రాజీనామాల నేపథ్యంలో... యోగి వేమన వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ గా వర్సిటీ ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

అటు, నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పదవికి రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఆయన కడపలోని యోగి వేమన వర్సిటీలో ప్రొఫెసర్ గా చేరారు.


More Telugu News