నీట్ పరీక్షపై ప్రధాని మోదీకి, తెలంగాణ సహా 8 మంది సీఎంలకు స్టాలిన్ లేఖ
- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన తమిళనాడు సీఎం
- నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరిన స్టాలిన్
- నీట్ అనేది విద్యార్థులపై అనవసరమైన అదనపు ఒత్తిడి అని వ్యాఖ్య
నీట్ విధానాన్ని ఎత్తివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో నీట్ పరీక్షను నిర్వహిస్తారు. అయితే నీట్‌ను ఎత్తివేయాలని కోరుతూ ప్రధానితో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు.
నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరారు. వృత్తిపరమైన కోర్సుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 12వ తరగతి మార్కుల ద్వారా మాత్రమే ఉండాలని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. నీట్ అనేది విద్యార్థులపై అనవసరమైన అదనపు ఒత్తిడి అన్నారు.
నీట్ పరీక్ష ప్రక్రియను తొలగించాల్సిన అవసరంపై ఇతర రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్ల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినట్లు స్టాలిన్ వెల్లడించారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ బిల్లును పంపించినట్లు చెప్పారు. ఇది పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.
నీట్ రద్దు కోసం...
నీట్ రద్దు కోసం అసెంబ్లీలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు. నీట్ మినహాయింపుకు తాము చేస్తున్న డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరారు.