టెక్స్ టైల్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తాం: రేవంత్ రెడ్డి

  • వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి
  • టెక్స్‌టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామని హామీ
టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని తాము ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. గీసుకొండ మండలం శాయంపేటకు వచ్చిన సీఎం... వనమహోత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్ పార్కులో మొక్కలు నాటారు.

అనంతరం కైటెక్స్, యంగ్‌వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. టెక్స్‌టైల్ కోసం భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్క్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


More Telugu News