టెల్కోలు బాదేస్తున్నాయి.. మొన్న జియో.. నిన్న ఎయిర్‌టెల్.. నేడు వొడాఫోన్ ఐడియా

  • 11 నుంచి 24 వరకు ధరలు పెంచిన వొడాఫోన్ ఐడియా
  • జులై 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి
  • బేసిక్ ప్లాన్ ధర రూ. 179 నుంచి రూ.199కి పెంపు
టెల్కోలన్నీ కట్టగట్టుకుని వినియోగదారుల మీద పడ్డాయి. టారిఫ్ చార్జీలను పెంచుతూ జేబులు గుల్ల చేయడానికి రెడీ అవుతున్నాయి. మొన్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ చార్జీలను పెంచుతూ నిర్ణయించుకోగా, నిన్న ఎయిర్‌టెల్ కూడా ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది. జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని టెల్కోలు రెండూ ప్రకటించాయి.

తాజాగా, ఈ జాబితాలో వొడాఫోన్ ఐడియా కూడా చేరింది. జులై 4 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. వివిధ కేటగిరీల్లో 11 నుంచి 24 శాతం వరకు ధరలు పెంచింది. ప్రస్తుతం రూ. 179గా ఉన్న ఎంట్రీలెవల్ ప్లాన్ ధరను 11శాతం పెంచి రూ.199 చేసింది. అలాగే, 84 రోజుల వ్యాలిడిటీతో లభించే రూ.719 ప్లాన్ ధరను రూ. 859కి పెంచింది. రూ.2,899కి లభించే వార్షిక ప్లాన్‌ ధరను 21 శాతం పెంచి రూ.3,499కి పెంచింది.

  


More Telugu News