కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్
- హైదరాబాద్‌లో తెల్లవారుజామున తన నివాసంలో గుండెపోటుతో మృతి
- తండ్రి ఎప్పటికీ తనతోనే తనలోనే ఉంటారంటూ కుమారుడు అర్వింద్ కన్నీటి పర్యంతం
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో బీఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు. ఇక చిన్న కుమారుడు అర్వింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.
డీఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989-94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా, 2004-08 మధ్య కాలంలో ఉన్నతవిద్య, అర్బన్, లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నాటి టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్‌తో కలిసి కృషి చేశారు.
సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డీఎస్‌కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2013- 15 వరకూ శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారీ ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2018లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. 2016-22 మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్టీతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
తండ్రి దూరమవడంపై కుమారుడు అర్వింద్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. నాలోనే ఉంటావు’’ అని అర్వింద్ కన్నీరుమున్నీరయ్యారు.