కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలకు మూడ్రోజులపాటు బ్రేక్
- అధినేతకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన బీఆర్ఎస్
- ఆత్మీయ సమావేశాల పునఃప్రారంభం ఎప్పుడో త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడి
- పక్షం రోజులుగా వేలాదిమందిని కలిసిన కేసీఆర్
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పదిహేను రోజులుగా కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. అయితే, వీటికి మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చి... అధినేతకు విశ్రాంతి ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌తో చర్చించి పార్టీ ముఖ్య నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆత్మీయ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడు? ఏ నియోజకవర్గాల వారు ఎప్పుడు రావాలి? అనే విషయాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత, పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో గత రెండు వారాలుగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, నేతలను భేటీ అవుతున్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వస్తున్న వారిని కలుస్తున్నారు. 15 రోజుల్లో వేలాదిమందిని ఆయన కలిశారు.