ఈ ప్రభుత్వంలో అలాంటివి చెల్లవు: మంత్రి నాదెండ్ల

  • కాకినాడలో పర్యటించిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల
  • కాకినాడ పోర్టులో బియ్యం గోడౌన్ల తనిఖీ
  • రెండు గోడౌన్లలో రేషన్ బియ్యం గుర్తింపు
  • పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందంటూ విమర్శలు
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ కాకినాడలో పర్యటించారు. కాకినాడ పోర్టు వద్ద బియ్యం గోడౌన్లలో తనిఖీలు చేపట్టారు. రెండు గోడౌన్లలో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. ఆ రెండు గోడౌన్లలోని 4,700 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

తన పర్యటనలో భాగంగా, మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కోసం ప్రభుత్వ శాఖలన్నీ పనిచేశాయని విమర్శించారు.  

గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి కాకినాడకు వేల లారీల బియ్యం తరలించారని, పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందని ఆరోపించారు. అయితే, కూటమి ప్రభుత్వంలో అలాంటివి చెల్లవని, అధికారులు కూడా పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు.


More Telugu News