టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు

  • అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి రికార్డు విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావు
  • పల్లా శ్రీనివాసరావును టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమించిన చంద్రబాబు
  • నేడు బాధ్యతలు చేపట్టి చంద్రబాబుకు, లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపిన పల్లా శ్రీనివాసరావు
గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు మెజారిటీతో ఎన్నికైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమితుడు అవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను తనకు అప్పగించిన చంద్రబాబు, నారా లోకేశ్ లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. 

పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై 95,235 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. 

పల్లా శ్రీనివాసరావు బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ఆయన విశాఖ పార్లమెంటరీ స్థానం టీడీపీ ఇన్చార్జిగా సమర్థవంతంగా వ్యవహరించడం టీడీపీ అధినాయకత్వాన్ని ఆకట్టుకుంది.


More Telugu News