ఒకేసారి 54 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం.. వెలుగులోకి పెద్దిరెడ్డి సిఫారసు లేఖ
- గత ప్రభుత్వం టీటీడీ పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిందన్న టీడీపీ
- పెద్దిరెడ్డి బ్రేక్ దర్శనం స్కాం, శ్రీవాణి ట్రస్ట్ కుంభకోణంపైనా టీటీడీ విజిలెన్స్ విచారణ
- తిరుమలలో వైసీపీ నేతలు దందాలు చేశారని ఆరోపణ
వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనంలో ఒకేసారి 54 మందిని శ్రీవారి దర్శనానికి పంపిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ ఆయన రాసిన సిఫారుసు లేఖను తాజాగా తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను నాశనం చేయాలని చూసిందని మండిపడింది. తిరుమలలో వైసీపీ పెద్దలు యథేచ్ఛగా దందాలు చేశారని ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని పంపించాలని రాసిన సిఫారసు లేఖ ఇదేనని పేర్కొంది. ఈ బ్రేక్ దర్శనం స్కాంతోపాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కుంభకోణంపైనా టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించినట్టు తెలిపింది.