గృహిణిగా ఉండేందుకు భర్తను ఆస్తిలో సగం వాటా అడిగిన మహిళ!
- ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండటంతో భార్యను ఉద్యోగం మానేయాలన్న భర్త
- గృహిణిగా కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని సూచన
- ఇందుకు ప్రతిగా భర్త కంపెనీలో సగం వాటా కోరిన భార్య
- అపరాధభావం ముంచెత్తడంతో తన ఆవేదన పంచుకున్న మహిళ, మద్దతుగా నిలిచిన నెటిజన్లు
- భర్త తన ప్రతిపాదనకు అంగీకరించాడంటూ మరో పోస్టు
ఉద్యోగం మాని ఇంటిపట్టునే ఉంటూ కుటుంబం బాగోగులు చూడమని కోరిన భర్తను అతడి కంపెనీలో సగం వాటా కోరిన భార్య ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తొలుత అపరాధ భావనకు లోనైన మహిళ తన సమస్యను నెటిజన్లతో పంచుకుంది. అయితే, నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. తమకు పెళ్లై ఆరేళ్లు అవుతోందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను మళ్లీ గర్భవతినని తెలిపింది. తన భర్త మంచి సంపాదనపరుడని, ఆర్థికంగా తమకు ఎటువంటి లోటు లేదని వివరించింది.
ఆర్థికంగా తాము ఉన్నతస్థితిలో ఉండటంతో తనను ఉద్యోగం మానేసి గృహిణిగా ఉండాలని భర్త కోరినట్టు మహిళ చెప్పుకొచ్చింది. కుటుంబం, పిల్లలు బాగోగులు చూసుకోవాలని చెప్పాడని తెలిపింది. అయితే, తాను కెరీర్ వదులుకుని గృహిణిగా ఉండిపోవాలంటే భర్తను తన కంపెనీలో సగం వాటా కోరానని చెప్పుకొచ్చింది. ఇందుకు గల కారణాలను విపులంగా రాసుకొచ్చింది. దురదృష్టవశాత్తూ భవిష్యత్తులో తాము విడిపోతే లేటు వయసులో మళ్లీ తను ఉద్యోగం చేయాల్సి వస్తుందని వివరించింది. అప్పటికి తన నైపుణ్యాలకు కాలదోషం పడుతుందనీ, పోషణ కోసం చిన్నా చితకా ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, జీవన భృతి కోసం మాజీ భర్తపై కోర్టుకెక్కడం కూడా తన నైజం కాదని తెలిపింది. కాబట్టి, తన భవిష్యత్తు భద్రత దృష్ట్యా ఈ కండిషన్ పెట్టినట్టు వివరించింది. ఈ విషయాన్ని స్నేహితులకు చెబితే వారు తనపై మండిపడ్డారని మహిళ చెప్పుకొచ్చింది. తాను స్వార్థం, అనవసర భయాలతో సతమతమవుతున్నానని వారు అన్నారని చెప్పింది.
అయితే, సోషల్ మీడియా జనాలు మాత్రం మహిళకు మద్దతు తెలిపారు. ఆమె భయాలు సహేతుకమైనవేనని చెప్పారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇలాంటి ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని అన్నారు. ఆమె కోరిక నైతికమైనదని కూడా చెప్పారు. భార్యాభర్తల మధ్య సమస్యల పరిష్కారానికి స్నేహితులు, బంధువుల జోక్యం అవసరం లేదని అన్నారు. ఇలా నెట్టింట తన పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వస్తుండటంతో మహిళ మరో అప్‌డేట్ ఇచ్చింది. తన ప్రతిపాదనకు భర్త అంగీకరించాడని, కంపెనీలో 49 శాతం వాటా ఇచ్చేందుకు అంగీకరించాడని పేర్కొంది.