బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ ధర్నా
- జులై 1న నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ నిరసన
- జులై 3న దిష్టిబొమ్మ దహనం... 6వ జీఎం కార్యాలయ ముట్టడి
- జులై 9న గోదావరిఖనిలో ధర్నా... పాల్గొననున్న కేటీఆర్
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నిరసన చేపట్టనుంది. దాదాపు పది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జులై 1వ తేదీ నుంచి జులై 9 వరకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు వుంటాయి. జులై 1న నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలుపుతారు. జులై 3న దిష్టిబొమ్మను దహనం చేస్తారు. జులై 6న సింగరేణి జీఎం కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. జులై 9న గోదావరిఖనిలో ధర్నా చేపడతారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.