బీహార్‌లో కుంగిన మరో వంతెన
- బహదూర్ గంజ్ - దిఘాల్ బ్యాంక్ బ్లాక్‌ల మధ్య నిలిచిన రాకపోకలు
- ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారుల వెల్లడి
- ప్రవాహం ధాటికి వంతెన పిల్లర్లు కుంగిపోయాయన్న అధికారులు
బీహార్‌లో 10 రోజుల వ్యవధిలో మరో వంతెన కుంగింది. కిషన్‌గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో బహదూర్ గంజ్ - దిఘాల్ బ్యాంక్ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గత పది రోజుల్లోనే ఇలాంటి ఘటన ఇది నాలుగోది కావడం గమనార్హం.
కంకయీ, మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై 2011లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటిమట్టం పెరిగింది. ప్రవాహం ధాటికి వంతెన పిల్లర్లు కుంగిపోయినట్లు జిల్లా మెజిస్ట్రేట్ తుషార్ సింగ్లా తెలిపారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. అంతకుముందు, తూర్పు చంపారన్, సివాన్, అరారియా జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి.