పరుగులు తీసిన స్టాక్ మార్కెట్... సాయంత్రానికి లాభాలతో ముగింపు

  • ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో నష్టాలు
  • క్రమంగా పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ
  • లాభాల బాటలో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్
  • నష్టాలు చవిచూసిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, మారుతి సుజుకి
జాతీయ, అంతర్జాతీయ  పరిణామాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్ సూచీలు సాయంత్రానికి లాభాల బాటలో దూసుకుపోయాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో నష్టాలు చవిచూసినప్పటికీ... సెన్సెక్స్, నిఫ్టీ క్రమంగా పుంజుకున్నాయి. 

సెన్సెక్స్ 563.93 పాయింట్ల వృద్ధితో తొలిసారిగా 79 వేల మార్కును అందుకుంది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 79,243.18 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ సైతం ఇవాళ జోరు ప్రదర్శించింది. ఆరంభంలో ఒడిదుడుకులు మినహాయిస్తే... ముగింపు సమయానికి ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. 175.70 పాయింట్ల వృద్ధితో 24,044.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 వేల మార్కు అందుకోవడం ఇదే మొదటిసారి. 

ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్ సంస్థల షేర్లు  లాభపడ్డాయి. సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, మారుతి సుజుకి, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూశాయి.


More Telugu News