2018లో స్పార్క్స్ స్లిప్పర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్... ఇంతవరకు డెలివరీ కాని వైనం!
- రూ.485 విలువైన స్పార్క్స్ స్లిప్పర్స్‌ను ఆర్డర్ చేసిన ముంబైకి చెందిన వ్యక్తి
- 20 మే 2018న డెలివరీ కావాల్సినప్పటికీ అందుకోని వైనం
- యాప్‌లో ఎప్పుడు చూసినా 'ఈరోజు వస్తుంద'ని స్టేటస్
- ఆరేళ్ల తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి ఫోన్ రావడంతో ఆశ్చర్యం
ఆరేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో స్పార్క్స్ స్లిప్పర్స్ కోసం ఆర్డర్ చేసిన వ్యక్తికి ఇప్పటికీ అవి డెలివరీ కాలేదు. పైగా, ఇటీవల ఆర్డర్ విషయంలో ఏదైనా సమస్య ఉందా? అని ఫ్లిప్‌కార్ట్ నుంచి అతనికి కాల్ వచ్చింది. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతయింది. ముంబైకి చెందిన అహ్సన్ ఖర్బాయి మే 2018లో ఒక జత స్పార్క్స్ స్లిప్పర్స్‌ను ఆర్డర్ చేశాడు. కానీ ఇప్పటి వరకు అతను వాటిని రిసీవ్ చేసుకోలేదు. ఇటీవలే తనకు కాల్ రావడంతో ఇందుకు సంబంధించిన వివరాలను అతను ఎక్స్ వేదికగా పోస్ట్ శాడు.
తాను మే, 16, 2018లో రూ.485 విలువైన స్పార్క్స్ స్లిప్పర్స్‌ను ఆర్డర్ చేశానని... ఆర్డర్ వివరాల ప్రకారం చెప్పులు మూడు రోజుల తర్వాత తనకు అందాల్సి ఉందన్నారు. అంటే మే 19న షిప్పింగ్ చేసినట్లుగా కనిపించిందని, డెలివరీ తేదీ మే 20 (2018) అని చూపించిందన్నారు.
కానీ ఈరోజు వరకు తాను ఆ ఆర్డర్‌ను అందుకోలేదని తనకు ఎదురైన వింత అనుభవాన్ని ఎక్స్‌లో వివరించారు. యాప్‌లో మాత్రం ఎప్పుడు చూసినా 'అరైవింగ్ టుడే' (ఈరోజు అందనున్నాయి) అని కనిపించేదన్నారు. ఈ రోజుకు కూడా తన యాప్‌లో అలాగే కనిపిస్తోందన్నారు. కానీ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు, తనకు ఫ్లిప్ కార్ట్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు.