అమావాస్య రోజు సూరజ్ రేవణ్ణ వింత ప్రవర్తన.. ఎర్ర చీర, నల్ల గాజులతో సింగారం

  • సూరజ్ రేవణ్ణ కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడించిన సీఐడీ
  • వివాహమైన కొన్నాళ్లకే భార్యకు దూరమైన సూరజ్
  • మూడేళ్ల కిందట విడాకులు మంజూరు చేసిన కోర్టు
కర్ణాటకలో కలకలం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబ సభ్యులు జైలు పాలైన విషయం తెలిసిందే. దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఈ కేసులో కటకటాల పాలవగా.. బెయిల్ పై రేవణ్ణ బయటకు వచ్చారు. ఇటీవల రేవణ్ణ పెద్ద కొడుకు, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కూడా మరో లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. తమ కుటుంబానికి చెందిన పార్టీ జేడీఎస్ కార్యకర్త ఒకరిపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో సూరజ్ పై కేసు నమోదైంది. గెస్ట్ హౌస్ కు పిలిపించుకుని తనపై అసహజ లైంగిక చర్యకు పాల్పడినట్లు బాధితుడు చెబుతున్నాడు.

తాజాగా, ఈ కేసు విచారిస్తున్న సీఐడీ అధికారులు బయటపెట్టిన వివరాలు సంచలనంగా మారాయి. అధికారుల విచారణలో బయటపడ్డ వివరాల ప్రకారం.. సూరజ్ రేవణ్ణ అమవాస్య రోజు వింతగా ప్రవర్తించేవాడని, ఎర్ర చీర కట్టుకుని, నల్ల గాజులు వేసుకునే వాడని అధికారులు గుర్తించారు. ఇదే విషయం బాధితుడు కూడా వెల్లడించాడు. ఈ అవతారానికి సంబంధించిన ఫొటోలు సూరజ్ ఫోన్ లో ఉన్నాయని చెప్పాడు. దీంతో సూరజ్ ఫోన్ ను జఫ్తు చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

2019 ఎన్నికల సమయంలో అరకలగూడులో సూరజ్ తో తనకు పరిచయం ఏర్పడిందని బాధితుడు చెప్పాడు. ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడని వివరించాడు. అప్పటి నుంచి రోజూ ఉదయం విషెస్ పంపడం, లవ్ సింబల్స్ ను వాట్సాప్ లో పంపడం చేస్తుండేవాడని తెలిపాడు. ఒకరోజు ఫాంహౌస్ కు రమ్మని పిలవడంతో తాను వెళ్లానని, అక్కడ తనతో కాళ్లు ఒత్తించుకున్నాడని చెప్పాడు. ఆపై బెదిరించి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించాడు.

భార్యతో విడాకులు..
సాగరిక రమేశ్ ను సూరజ్ రేవణ్ణ 2018లో వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్ని నెలలకే వారిద్దరూ దూరమయ్యారు. అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించడంతో సూరజ్ ను దూరంపెట్టిన సాగరిక.. కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిందని ఆమె లాయర్ వివరించారు. మూడేళ్ల కిందటే వారికి కోర్టు విడాకులు మంజూరు చేసిందని చెప్పారు.


More Telugu News