అనంత్ అంబానీ పెళ్లి పత్రిక చూశారా?.. వెండి ఆలయం, దేవుళ్ల విగ్రహాలు.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు!
- జులై 12న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం
- నెట్టింట ప్రత్యక్షమైన పెళ్లి పత్రిక తాలూకు వీడియో
- వీడియో చూసి, ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
- ఒక ప్రత్యేక పెట్టె రూపంలో వివాహ ఆహ్వాన పత్రిక
- వెండితో చేసిన ఆలయం లోపల వినాయక, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు
భారత అపరకుబేరుడు, సంపన్న పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. దీంతో అంబానీ కుటుంబం పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. పెళ్లి ఏర్పాట్ల మధ్య అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. ఈ క్రమంలో అంబానీ పెళ్లి పత్రిక తాలూకు వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. వీడియో చూస్తే మతిపోవాల్సిందే. ఈ వెడ్డింగ్ కార్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివాహ ఆహ్వాన పత్రికను ఒక ప్రత్యేక పెట్టె రూపంలో తీర్చిదిద్దారు. దీనికి లైట్లు, ఎరుపు రంగుతో అలంకరించారు. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. అందులో వెండితో చేసిన ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయం లోపల వెండితోనే చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. దేవుళ్ల శిల్పాలతో తయారు చేయబడిన ఈ ఆహ్వాన పత్రిక ఒక చక్కటి కళాఖండాన్ని తలపిస్తుంది. అతిథులకు ఈ వెండి కార్డుతో పాటు పలు బహుమతులు కూడా ఇస్తున్నట్లు సమాచారం. వీవీఐపీ అతిథులకు అంబానీ కుటుంబ సభ్యులే స్వయంగా వెళ్లి కార్డులు ఇస్తున్నారట.
ఇక అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ల మాదిరిగానే వివాహ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీనికోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది అంబానీ కుటుంబం.
ఇటీవలే ముఖేశ్ అంబానీ పెళ్లి కార్డును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. అలాగే నీతా అంబానీ కూడా వారణాసి వెళ్లి కాశీ విశ్వనాథ్ ముందు పెళ్లి కార్డు ఉంచారు. అటు అనంత్ అంబానీ తన పెళ్లి కార్డు ఇవ్వడానికి బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవగణ్, కాజోల్ ఇంటికి వెళ్లారు. దీంతో పెళ్లి కార్డుల పంపిణీ జోరుగా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..