కస్టడీలో మేకప్ వేసుకున్న పవిత్ర గౌడ.. మహిళా ఎస్సైకి నోటీసులు
- పవిత్ర గౌడను బెంగళూరులోని ఆమె నివాసంలో ప్రశ్నిస్తున్న పోలీసులు
- పోలీసులతో బయటకొచ్చే సమయంలో మేకప్ వేసుకుంటూ కనిపించిన సినీనటి
- హత్య కేసులో ముద్దాయి అయినా పశ్చాత్తాపం లేదంటూ నెట్టింట విమర్శలు
- నటిని అడ్డుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన మహిళా ఎస్సైకి ఉన్నతాధికారుల నోటీసులు
కన్నడ నటుడు దర్శన్ తూగదీప ఫ్యాన్ రేణుకస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న దర్శన్ ప్రేయసి, సినీనటి పవిత్ర గౌడ్ పోలీసు కస్టడీలో ఉండగా మేకప్ వేసుకోవడం సంచలనంగా మారింది. ఇంత జరిగినా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆమె వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేణుకస్వామి హత్య తీరుతెన్నులను తెలుసుకునేందుకు పోలీసులు పవిత్ర గౌడను బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మెకప్ వేసుకుంటూ తన నివాసం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసులు వెంట ఉన్నప్పుడే ఆమె మేకప్ వేసుకున్నట్టు వెల్లడైంది. ఘటనపై సీరియస్ అయిన పోలీసు ఉన్నతాధికారులు పవిత్ర గౌడ వెంట ఉన్న మహిళా ఎస్సైకి నోటీసులు జారీ చేశారు. సినీనటిని అడ్డుకోవడంలో ఎస్సై నిర్లక్ష్య పూరిత వైఖరిపై వివరణ కోరారు.
‘‘పవిత్ర తాను ఉండే ఇంట్లోనే మేకప్ బ్యాగు పెట్టుకుని ఉండాలి. ఆ లేడీ పీఎస్సై ప్రతిరోజూ పవిత్రను ఆమె ఇంటి నుంచి ఏపీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేవారు. కాబట్టి, ఆమె పవిత్రను కనిపెట్టి ఇలాంటివి చేయకుండా అడ్డుకుని ఉండాల్సింది. ఈ నిర్లక్ష్యానికి వివరణ కోరుతూ ఆమెకు నోటీసులు జారీ చేశాం’’ అని డీసీపీ (వెస్ట్) గిరీశ్ మీడియాకు తెలిపారు.
పవిత్ర గౌడ.. దర్శన్‌ను రెచ్చగొట్టి రేణుకస్వామిని హత్య చేయించిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కాగా, హత్యకు పాల్పడిన దర్శన్ ఈ కేసులో నెం.2 నేరస్థుడిగా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేణుకస్వామి పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపినట్టు తెలుసుకున్న దర్శన్ తీవ్ర ఆగ్రహానికి లోనై కుట్రపూరితంగా అతడిని హత్య చేశాడు. జూన్ 9న అతడి మృతదేహం ఓ నాలా వద్ద లభించింది. అతడిని హింసించి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు.