ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌.. జాబితాలో మీ మొబైల్‌ ఉందా?

  • పాత డివైజుల్లో వాట్సాప్ సేవలు నిలిపేస్తామంటూ సంస్థ ప్రకటన
  • సేవలు నిలిచిపోతున్న ఫోన్ల జాబితాను విడుదల చేసిన కెనాల్ టెక్
  • కొత్త డివైజ్‌లకు అప్‌గ్రేడ్ కావాలని వినియోగదారులకు వాట్సాప్ సూచన
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, భద్రతా కారణాల రీత్యా తన సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు తాజాపరుస్తూ అప్‌డేట్స్ విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో కొన్ని పాత ఫోన్ మోడళ్లకు సేవలు నిలిపివేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మరిన్ని స్మార్ట్ ఫోన్ మోడళ్లల్లో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మోడళల్లో సేవలు నిలిచిపోతాయని హెచ్చరించింది. వాట్సాప్ సేవలు నిలిచిపోయిన ఫోన్ల జాబితాను కెనాల్‌టెక్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన 35 రకాల మోడళ్లు ఈ లిస్టులో ఉన్నాయి. 

  • శాంసంగ్: గాలక్సీ ఏస్ ప్లస్, గాలక్సీ కోర్, గాలక్సీ ఎక్స్‌ప్రెస్ 2, గాలక్సీ గ్రాండ్, గాలక్సీ నోట్ 3, గాలక్సీ ఎస్ 3 మినీ, గాలక్సీ ఎస్ 4 యాక్టివ్, గాలక్సీ ఎస్ 4 మినీ, గాలక్సీ ఎస్ 4 జూమ్.
  • మొటొరోలా: మోటో జీ, మోటో ఎక్స్.
  • యాపిల్: ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ
  • హువావే: ఎసెండ్ పీ6 ఎస్, ఎసెండ్ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625.
  • లెనోవా: లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్890
  • సోనీ: ఎక్స్‌పీరియా జీ1, ఎక్స్‌పీరియా ఈ3
  • ఎల్‌జీ: ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7
పైన పేర్కొన్న ఫోన్లలో వాట్సాప్ సేవలు రానున్న రోజుల్లో నిలిచిపోతాయని వాట్సాప్ పేర్కొంది. కొత్త డివైజ్‌లకు అప్‌గ్రేడ్ కావాలని సూచించింది. సపోర్టు లేని డివైజులతో భద్రతా సంబంధిత సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది.


More Telugu News