కాస్త మెదడు వాడండి.. పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్‌పై నిప్పులు చెరిగిన రోహిత్ శర్మ

  • ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అర్షదీప్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడన్న ఇంజమామ్
  • వికెట్ డ్రైగా ఉండటంతో 12 లేదా 13వ ఓవర్ నుంచి బంతి రివర్స్ స్వింగ్ అవుతోందన్న రోహిత్ 
  • మ్యాచ్ పరిస్థితుల కారణంగానే బౌల్ రివర్స్ స్వింగ్ అయిందని స్పష్టీకరణ
సెయింట్ లూషియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ అర్షదీప్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన ఆరోపణలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. ఏదైనా మాట్లాడే ముందు కాస్త మెదడు వాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 205 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ ఆస్ట్రేలియా 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన రోహిత్ శర్మ 92 పరుగులు చేశారు. బౌలర్లు కూడా సమష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాను టీమిండియా సులభంగా కట్టడి చేయగలిగింది. 

కాగా, ఇంజమామ్ ఆరోపణలపై రోహిత్ మండిపడ్డాడు. ‘‘ఇలాంటి వాటికి ఏమని సమాధానం చెప్పగలం. వికెట్స్ డ్రైగా ఉంటే బాల్ సహజంగా రివర్స్ స్వింగ్ అవుతుంది. అన్ని టీంలు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కామెంట్స్ చేసేటప్పుడు కాస్తంత ఆలోచించాలి. మనం ఎక్కడ ఆడుతున్నామనేది పరిగణనలోకి తీసుకోవాలి. మనం ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలో ఆడట్లేదు కదా. 15వ ఓవర్లో అర్షదీప్ బౌలింగ్‌కు దిగినప్పుడు బంతి రివర్స్ స్వింగ్ అవుతోంది. అంటే..12 లేదా 13 ఓవర్లోనే రివర్స్ స్వింగ్ ప్రారంభమైందని అనుకోవాలి. ఇటువంటి విషయాల్లో అంపైర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. మాకూ రివర్స్ స్వింగ్ తెలుసు. అర్షదీప్ 15వ ఓవర్లో వచ్చి రివర్స్ స్వింగ్ మొదలెట్టాడంటే ఇందుకు అతడు ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవాలి. బ్రూ బౌలింగ్ శైలి కారణంగా అతడు ఈజీగా రివర్స్ స్వింగ్ చేస్తాడు. ఇతరులకు మాత్రం అన్నీ కలిసొస్తేనే ఇది సాధ్యం’’ అని చెప్పుకొచ్చాడు.


More Telugu News