ఫోన్ ట్యాపింగ్ కేసు: బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు

  • తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వవచ్చునన్న నిందితులు
  • తాము 90 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామన్న పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ పై తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి రిజర్వ్ చేసింది. తిరుపతన్న, భుజంగరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వవచ్చునని వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వవచ్చునని పలు తీర్పులు చెబుతున్నాయన్నారు.

అయితే, తాము 90 రోజుల లోపే ఛార్జిషీట్ దాఖలు చేశామని పోలీసుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఛార్జిషీట్‌ను కోర్టు తిప్పి పంపించిందని... ఇలా పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.


More Telugu News