ఒకే ఓవర్‌లో 43 పరుగులు... చెత్త రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్న బౌలర్... వీడియో ఇదిగో

  • కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా లీసెస్టషైర్, సస్సెక్స్ మధ్య మ్యాచ్
  • ఎనిమిదో ఆటగాడిగా వచ్చిన లూయిస్ కింబర్
  • రాబిన్సన్ 59వ ఓవర్‌లో ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయిన బ్యాట్స్‌మెన్
ఒకే ఓవర్‌లో 43 పరుగులు సాధించి ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పాడు లూయీస్ కింబర్ అనే బ్యాట్స్‌మెన్. లీసెస్టషైర్, సస్సెక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్ నమోదయింది. దీంతో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు ఇంగ్లాండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా లీసెస్టషైర్ ఆటగాడు లూయీస్ కింబర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. సస్సెక్స్ బౌలర్ రాబిన్సన్ 59వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో కింబర్ సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి ఆడాడు. పైగా ఈ ఓవర్‌లో బౌలర్ మూడు నోబాల్స్ వేశాడు. మొత్తం రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లు కొట్టాడు. చివరి బంతికి సింగిల్ తీశాడు. ఈసీబీ డొమెస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో నోబాల్‌కు రెండు పరుగులు అదనంగా ఇస్తారు. ఇలా ఒక ఓవర్లో 43 పరుగులు వచ్చాయి. కౌంటీ ఛాంపియన్‌షిప్ 134 ఏళ్ల చరిత్రలో ఒక ఓవర్‌లో 43 రావడం ఇదే మొదటిసారి.


More Telugu News