నా మిత్రుడు చంద్రబాబుతో కలిసి పని చేస్తాం: టీడీపీ ఎంపీలతో ప్రధాని మోదీ
- ప్రధాని కార్యాలయంలో మోదీతో సమావేశమైన ఎంపీలు
- ఏపీ అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి
- ఇరుపార్టీలు కలిసి ఏపీ కోసం, దేశం కోసం పని చేస్తాయని వెల్లడి
తన మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో కలిసి పని చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధానిని కలిశారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడేందుకు సహకరించాలని ఎంపీలు కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
అనంతరం మోదీ మాట్లాడుతూ... రాష్ట్రంలో, కేంద్రంలో రెండు పార్టీలు కలిసి పని చేస్తాయన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తామన్నారు. మోదీని కలిసిన వారిలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.