తాగునీటి సరఫరాపై హైదరాబాద్ వాసులకు అలర్ట్!

  • హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
  • కృష్ణా ఫేజ్ 2 పంపు హౌస్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిపివేత
  • ఎల్బీ నగర్, బాలపూర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, రామంతాపూర్, బద్వేల్, శంషాబాద్ ప్రాంతాల్లో అంతరాయం
హైదరాబాద్ వాసులకు అలర్ట్! రేపు అనగా... గురువారం రోజున నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా ఫేజ్ 2 పంపు హౌజ్ మరమ్మతుల కారణంగా వివిధ ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్, బాలాపూర్, సికింద్రాబాద్, బేగంపేట, ఉప్పల్, రామంతాపూర్, బద్వేల్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.


More Telugu News