కేంద్రం నుంచి వచ్చిన రూ.1000 కోట్లు ఏమయ్యాయి?: అధికారులను ప్రశ్నించిన పవన్ కల్యాణ్

  • స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌పై డిప్యూటీ సీఎం సమీక్ష
  • కార్పోరేషన్ పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు
  • కేంద్రం నిధులపై అధికారులను ప్రశ్నించిన ఉపముఖ్యమంత్రి
  • ఆ నిధులను ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదన్న అధికారులు
గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,066 కోట్లు ఏమయ్యాయని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆయన బుధవారం స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. కార్పోరేషన్ పనితీరుపై ఉపముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

అనంతరం, ఆయన స్వచ్ఛాంధ్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. అయిదేళ్ళలో కేంద్రం నుంచి వెయ్యి కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడకు పోయాయని అధికారులను ప్రశ్నించారు. అయితే నాటి ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.


More Telugu News