మాజీ మంత్రి పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌లపై స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
- ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఈ-మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు
- గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై ఫిర్యాదు
మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన ఈ-మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా వారిపై ఫిర్యాదు చేశారు. వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో, పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన సభ సెక్రటరీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఇదివరకు పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై కూడా ఫిర్యాదు చేశారు.