అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారు: మంత్రి పయ్యావుల కేశవ్
- జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని.. ప్రతిపక్ష నేత కాదన్న మంత్రి
- మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారంటూ వ్యాఖ్య
- ప్రతిపక్ష నేతగా ఉంటే క్యాబినేట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని చురక
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని మంత్రి తెలిపారు. జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని పేర్కొన్నారు.
సీఎం తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణం చేయాలని జగన్ చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా లేనందున ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ప్రమాణం చేశారని ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేతగా ఉంటే క్యాబినేట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని తెలిపారు. అలాగే 1984లో ఉపేందర్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్లు పట్టిందని మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు.