జీవన్‌రెడ్డికి సోనియా గాంధీ ఫోన్
- వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుండి పిలుపు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్‌రెడ్డి
- తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని ప్రకటన
- జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించిన మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుండి కాల్ వచ్చింది. జీవన్‌రెడ్డికి సోనియా గాంధీ ఫోన్ చేశారు. వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుండి పిలుపు వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంతో జీవన్‌రెడ్డి అలకబూనారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని ప్రకటించారు.
ఇక ఆదివారం మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఈరోజు భట్టి ఢిల్లీకి వెళ్లిన కాసేపటికే అధిష్ఠానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. దీంతో కాసేపట్లో డిల్లీకి జీవన్‌రెడ్డి వెళ్లనున్నారని సమాచారం. విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో ఢిల్లీ వెళ్లనున్నారు.