ఆర్థిక విషయాల్లో ట్రంప్.. ప్రజాస్వామ్యం విషయంలో బైడెన్.. అమెరికా ఓటర్ల మనోగతం
- అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందని రాయిటర్స్ సర్వే
- ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్
- మరోమారు పోటీ పడుతున్న ట్రంప్, బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. పదవి కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ల మధ్య గురువారం తొలి డిబేట్ జరగనుంది. ఈ డిబేట్ కోసం అమెరికన్లు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గతంలోనూ (2020 ఎన్నికల్లో) వీరిద్దరి మధ్య డిబేట్ జరిగింది.. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఈ ఇద్దరు నేతల మధ్య డిబేట్ ఎలా సాగనుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాది నవంబర్ లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనుండగా.. ట్రంప్, బైడెన్ లు మరోమారు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్ ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు నిర్వహించిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది.. మీరు ఎవరికి ఓటేస్తారంటూ రాయిటర్స్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 1.019 మంది (856 మంది రిజిస్టర్డ్ ఓటర్లు) అమెరికన్లను ప్రశ్నించి వారి అభిప్రాయాలు సేకరించింది.
ఆర్థికపరమైన విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ బెటర్ ఛాయిస్ అని, అదేసమయంలో ప్రజాస్వామ్య కోణంలో ఆలోచిస్తే జో బైడెన్ కే మా ఓటని అమెరికన్లు చెప్పారు. వాస్తవానికి గడిచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది, నిరుద్యోగిత 4 శాతం కన్నా తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఎకానమీ విషయంలో అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ సరైన ఛాయిస్ అని అమెరికన్లు చెబుతున్నారు. విదేశాలతో వివాదాలు, టెర్రరిజం సమస్యలను ట్రంప్ మాత్రమే సరిగ్గా డీల్ చేస్తారని అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న అమెరికన్లు ఏ విషయంలో ఎవరికి మద్ధతు పలికారంటే..

- వలస విధానంలో ట్రంప్ కు 44 %, బైడెన్ కు 31 %
- విదేశాలతో వివాదాలు, టెర్రరిజంపై ట్రంప్ కు 40 %, బైడెన్ కు 35 %
- డెమోక్రసీ విషయంలో ట్రంప్ 33 %, బైడెన్ కు 39 %
- హెల్త్ కేర్ పాలసీ విషయంలో ట్రంప్ 29 %, బైడెన్ కు 40%