మహిమాన్వితమైన కంచి కామాక్షి అమ్మవారి పీఠం ప్రత్యేకతలు ఇవే!

ఆది పరాశక్తి అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు భక్తులకు చాలా పవిత్రమైనవి. ప్రతి పీఠానికి ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. కంచి కామాక్షి అమ్మవారి పీఠం కూడా ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రత్యేకతను కలిగివుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని ఈ శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు.

కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. కాంచి కామాక్షి అమ్మవారికి సంబంధించిన మరిన్ని విశిష్ట ప్రత్యేకతలతో ఏపీ7ఏఎం వీడియోను రూపొందించింది. ఆ వీడియోను మీరూ వీక్షించండి.


More Telugu News