కేసీఆర్ కు మరో లేఖ రాసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్

  • కేసీఆర్ ను వెంటాడుతున్న విద్యుత్ కొనుగోళ్ల అంశం 
  • విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్
  • ఈ నెల 19న మరో లేఖ పంపిన వైనం
  • విద్యుత్ కొనుగోళ్లపై మరింత సమాచారం ఇవ్వాలని స్పష్టీకరణ
గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం కేసీఆర్ ను వదిలేట్టు లేదు. కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ రాసింది. నాటి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం కోరుతూ ఈ నెల 19న కమిషన్ లేఖ రాసింది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలకు జూన్ 27 లోపు బదులివ్వాలని స్పష్టం చేసింది. 

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరపడంపై మరిన్ని వివరాలు కావాలని కేసీఆర్ ను కమిషన్ కోరింది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై మరింత సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఈ మధ్య కాలంలో కొందరు లేవనెత్తిన సందేహాలను కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తన లేఖకు జత చేసింది.


More Telugu News