కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ట్రైలర్ విడుదల... లంచగొండులకు సేనాపతి ట్రీట్మెంట్ షురూ!
- కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు-2
- శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం
- జులై 12న వరల్డ్ వైడ్ రిలీజ్
- తాజాగా ట్రైలర్ ను పంచుకున్న చిత్రబృందం
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జీరో టాలరెన్స్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.
‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే... సమాజంలోని యువతలో పేరుకుపోయిన అసంతృప్తిని, సమాజంలోని రుగ్మతలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వీటన్నింటిని ప్రక్షాళన చేసే కథానాయకుడిగా, ముఖ్యంగా లంచగొండితనంపై స్వైరవిహారం చేసే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ జీవించారు అనిపించేలా ట్రైలర్ ఉంది.
సేనాపతి తనొక ఫ్రీడమ్ ఫైటర్‌గా తన గురించి చెబుతూ... "ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అనే పవర్‌ఫుల్, ఎమోషనల్ డైలాగ్స్ ‘భారతీయుడు 2’ ట్రైలర్‌లో ఉన్నాయి. ట్రైలర్‌లో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ యాక్షన్ సన్నివేశాలు, వాటిని అత్యద్భుతంగా తెరకెక్కించిన శంకర్ మేకింగ్ స్టైల్ నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇందులో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.