స్పీకర్ పదవికి ఇండియా కూటమి పోటీ చేయడంపై స్పందించిన పీయూష్ గోయల్
- ప్రతిపక్షం నిబంధనలను నిర్దేశించాలనుకుంటోందని విమర్శ
- డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలనే నిబంధన లేదని వెల్లడి
- ఖర్గే సీనియర్ నేత... గౌరవిస్తామన్న రాజ్‌నాథ్ సింగ్
లోక్ సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి కూడా పోటీ చేయడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. స్పీకర్ పోస్ట్ గురించి మాట్లాడితే... కాంగ్రెస్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్‌పై షరతులు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం నిబంధనలను నిర్దేశించాలనుకుంటోందన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని ఎక్కడా నిబంధన లేదన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికో తేలిన తర్వాతే స్పీకర్ పదవి విషయంలో మద్దతిస్తామని చెప్పిందన్నారు. షరతులతో కూడిన రాజకీయాలను తాము ఖండిస్తున్నామన్నారు.
ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత ఓం బిర్లాను స్పీకర్ పదవికి ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈరోజు ఉదయం రాజ్‌నాథ్ సింగ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేశారని... కానీ ఆయన బిజీగా ఉన్నారని, కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడమని చెప్పారని వెల్లడించారు. కానీ వారితో మాట్లాడిన తర్వాత షరతులు పెడుతున్నారన్నారు. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నారు. స్పీకర్ పదవికి ఎలాంటి ఎన్నిక లేకుండా అధికార, ప్రతిపక్షాలు కలిసి ఎన్నుకుంటే బాగుంటుందన్నారు.
మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్ నాయకుడని... ఆయన పట్ల తమకు గౌరవం ఉందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిన్నటి నుంచి ఆయనతో మూడుసార్లు స్పీకర్ ఎన్నిక గురించి మాట్లాడానని చెప్పారు. స్పీకర్ ఎన్నికపై కాంగ్రెస్ షరతులు విధిస్తోందని... కానీ డెమోక్రసీ అంటే షరతులపై నడవదని జేడీయూ సీనియర్ నేత, మంత్రి లాలన్ సింగ్ అన్నారు.