క్షీణించిన ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోగ్యం... ఆసుపత్రికి తరలింపు
- హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలంటూ అతిశీ నిరాహార దీక్ష
- రక్తంలో 36కు పడిపోయిన చక్కెరస్థాయులు
- ఉదయం లోక్ నాయక్ ఆసుపత్రికి తరలింపు
ఢిల్లీకి హర్యానా నీటిని విడుదల చేయాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె రక్తంలో చక్కెరస్థాయులు పూర్తిస్థాయిలో పడిపోయాయి. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఆమె లోక్ నాయక్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఉన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ట్వీట్ చేసింది.
అతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని... ఆమె రక్తంలో చక్కెరస్థాయులు అర్ధరాత్రి సమయంలో 43కు పడిపోయాయని వెల్లడించింది. ఆ తర్వాత 36కు పడిపోవడంతో తెల్లవారుజామున మూడు గంటలకు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆమె ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్‌లో పేర్కొంది.